యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈసినిమా కోసం అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో రాజమౌళి ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేసేశారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే పలు పాటలు రిలీజ్ అవ్వగా రీసెంట్ గా రిలీజ్ అయిన నాటు నాటు సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్లో రికార్డ్స్ సృష్టించింది. ముఖ్యంగా ఈసాంగ్ లో ఉన్న హుక్ స్టెప్ మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. చాలా మంది ఈ స్టెప్ పై వీడియోలు చేస్తున్నారు.. కొంతమంది ట్యుటోరియల్స్ కూడా చేస్తున్నారు. అంతలా పాపులర్ అయింది ఈ స్టెప్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎన్టీఆర్-చరణ్ బేసిగ్గా మంచి డ్యాన్సర్స్ కాబట్టి అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది డ్యాన్స్ మరి. అయితే ఎంత డ్యాన్సర్స్ అయినా అంత పర్ పెక్ట్ గా రావాలంటే దానికి చాలా కష్టపడాలి. ఇక ఈ డ్యాన్స్ కు కూడా చాలా టేక్స్ తీసుకున్నాం అని అంటున్నాడు ఎన్టీఆర్. స్టెప్స్ సరిగ్గా రావడం కోసం రాజమౌళి నరకం చూపించాడని.. తమ స్టెప్పులు కరెక్ట్ గా వస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి మధ్య మధ్యలో డాన్స్ ఆపేవాడని చెప్పాడు. దాదాపు 18 టేక్స్ తీసుకున్న తర్వాత రాజమౌళి ఒకే చెప్పారని.. ఇప్పుడు పాట విడుదలైన తర్వాత అందరూ పొగుడుతూ ఉంటే.. రాజమౌళి విజన్ అర్థమైందన్నారు ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్-చరణ్ లాంటి సూపర్ డ్యాన్సర్సే అన్ని టేక్స్ తీసుకున్నారంటే మాములు విషయం కాదు. రాజమౌళి కూడా అంత కేర్ తీసుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఇంత రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నారు.
కాగా రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 10,000 థియేటర్లలో దీనిని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: