స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ , తారాగణం తో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ భారీ అంచనాలతో 2022 జనవరి 7 వ తేదీ రిలీజ్ కానుంది. యువ సుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30″మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఎవరు మీలో కోటీశ్వరులు” టీవీ షోతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కొంత విరామం తర్వాత ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించారు. తాజాగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్యారిస్ టూర్‌కి వెళ్లారు. అక్కడ తన తనయుడు అభయ్‌రామ్‌ను ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను ఎన్టీఆర్ సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది. బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్1” మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “#NTR31″మూవీ కి హీరో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: