యంగ్ హీరో విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మై కడవులే రీమేక్ కూడా ఒకటి ఉంది. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వగా ఇటీవలే షూటింగ్ పూర్తయింది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగింపుదశకు వచ్చాయి. ఇక ఇదిలా ఉండగా ఇంతవరకూ ఈసినిమా టైటిల్ ను అయితే ప్రకటించలేదు మేకర్స్. తాజాగా ఈసినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈరీమేక్ కు ఓరి దేవుడా అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో విశ్వక్ సరసన బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
Here’s the Cool & Lovely First Look & Motion Poster of Mass ka Dass @VishwakSenActor & @mipalkar starrer #OriDevuda 🦋❤️.
Directed by @Dir_Ashwath
▶️ https://t.co/TdgjqLMF4p#OriDevudaFL #VS6 @leon_james @vidhu_ayyanna @Garrybh88 @vamsikaka @PVPCinema @SVC_official pic.twitter.com/YnCjHkG8eJ
— Sri Venkateswara Creations (@SVC_official) November 9, 2021
ఇక ఈసినిమాతో పాటు ప్రస్తుతం విద్యాసాగర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బాపినీడు, సుధీర్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: