వలయం వంటి డిఫరెంట్ థ్రిల్లర్ తో ఆకట్టుకున్న లక్ష్ఇప్పుడు మరో విభిన్నమైన కథతో రావడానికి సిద్దమయ్యాడు. ఇషాన్ సూర్య దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గంగరాజు అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ రిలీజై ఆకట్టుకుంది. ఇక ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల షూట్ కు బ్రేకులు పడ్డాయి. అయితే మళ్లీ ఇటీవలే రీస్టార్ట్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ కూడా తెలియచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో దత్తు హీరోయిన్ గా నటిస్తుంది. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. సుప్రీం, రాజా ది గ్రేట్, వంటి వరుస హిట్స్ తో దూసుకుపోతున్న సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: