‘హరిహర వీరమల్లు’ మళ్లీ మొదలు పెట్టిన పవన్..!

Power Star Pawan Kalyan Resumes Shooting Of Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Shooting Latest Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu Shooting Update,Director Krish Jagarlamudi,Director Krish,Krish,Nidhhi Agerwal,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal New Movie,Krish Movies,Krish New Movie,Krish Latest Movie,Krish Upcoming Movie,Krish Latest News,Pawan Kalyan New Movie Update,Hari Hara Veera Mallu Latest Update,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Latest Movie Update,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Latest Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Release Date,Hari Hara Veera Mallu Movie Release Date,Hari Hara Veera Mallu 2022,Pawan Kalyan New Movie Update,Pawan Kalyan Latest News,Pawan Kalyan Resumes Hari Hara Veera Mallu Movie Shooting,Hari Hara Veera Mallu Movie Shooting,Hari Hara Veera Mallu Updates,Hari Hara Veera Mallu Shooting,#HariHaraVeeraMallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈసినిమా తరువాత పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమాతో చేస్తున్న సంగతి కూడా విదితమే కదా. నిజానికి ఈసినిమా భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే కరోనా వల్ల బ్రేక్ పడగా మళ్లీ ఇంతవరకూ సెట్స్ పైకి రాలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. నేడు హైద్రాబాద్లో మొదలైన ఈసినిమా షెడ్యూల్ లో పవన్ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. ఈషూటింగ్ లో బాలీవుడ్ నటులు జాక్వెలిన్, అర్జున్ రాంపాల్ కూడా పాల్గొంటున్నారట.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి జాక్వెలిన్, అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 6 =