మెహెర్ తేజ్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘ఫ్యామిలీ డ్రామా’.మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి బ్యానర్లతో కలిసి తేజా కాసరపు నిర్మించిన ఈసినిమా ఇప్పటికే టీజర్, టైలర్ లతో అంచనాలను పెంచేసింది. ఇక ఈసినిమా ఈరోజు సోని లివ్‌లో విడుదలైంది. మరి ఈసినిమా ఆ అంచనాలను రీచ్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. సుహాస్, తేజ కాసరపు, పూజా కిరణ్, అనూష నూతుల, శ్రుతి మెహర్, సంజయ్ రథా తదితరులు
డైరెక్టర్.. మెహెర్ తేజ్
సమర్పణ.. మ్యాంగో మాస్ మీడియా
నిర్మాత..తేజా కాసరపు
బ్యానర్స్.. ఛష్మా ఫిలింస్, నూతన భారతి ఫిల్మ్స్ ఎల్ఎల్ పి
సంగీతం.. అజయ్ అండ్ సంజయ్
సినిమాటోగ్రఫి.. వెంకటేష్ ఆర్.శాఖమూరి
కథ
సదాశివ రావు (సంజయ్ రథ), పార్వతి (శృతి మెహర్) హైద్రాబాద్ లో ఓ ఇండిపెండెంట్ హౌజ్ లో జీవించే మధ్య తరగతి కుటుంబం. వీరికి ఇద్దరు కొడుకులు.. పెద్ద కొడుకు రామ్ (సుహాస్) అతని భార్య మహతి (అనూష నుంతల). చిన్నకొడుకు లక్ష్మణ్ (తేజ కాసరపు). అతడి భార్య పేరు యామిని (పూజా కిరణ్). ఇద్దరిదీ ప్రేమ వివాహం. అయితే సదా శివరావు మాత్రం ఎప్పుడూ ఇద్దరు కొడుకులను ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉంటాడు. ఉద్యోగం లేని కారణంగా పెద్ద కుమారుడు రామ (సుహాస్)ను ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. మరోవైపు ఉద్యోగం సంపాదించుకోకపోతే భార్యాభర్తలు ఇద్దరినీ బయటకు గెంటేస్తానని లక్ష్మణ్‌కు కూడా వార్నింగ్ ఇస్తాడు తండ్రి. ఇదిలా ఉంటే మరోవైపు నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. రామ ప్లాన్ ఏంటి? నగరంలో బ్లేడుతో గొంతుకోసి వరుస హత్యలకు పాల్పడుతున్న సీరియల్ కిల్లర్‌కు…ఈ ఫ్యామిలీకి సంబంధం ఏంటి? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ..
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే విధానం కూడా మారిపోయింది అని ఎన్నో సార్లు రుజువైంది.
సినిమా తీయాలంటే భారీ బడ్జెట్ లు, విదేశాల్లో లొకేషన్స్, పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ ఉండాల్సిన అవసరం లేదని కథలో బలం ఉంటే ఎలాంటి సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చుతుందని ఎన్నో సినిమాల విజయాలను చూశాం. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా సినిమా కూడా మరోసారి అది నిరూపించింది. ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టడానికి ఓ ఇల్లు, ఆరుగురు కుటుంబ సభ్యులు చాలు అని ‘ఫ్యామిలీ డ్రామా’ చూస్తే అర్థమవుతుంది.
ఇక డైరెక్టర్ మెహర్ తేజ్ మొదటి సినిమాతోనే తన మార్క్ ను వేయగలిగాడు. కథలో ఉన్న బలం.. అలానే పాత్రలను రాసుకున్న విధానం.. ట్విస్ట్ లు ఇలా అన్ని అంశాలను చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నాడు కాబట్టే మంచి రిజల్ట్ ను సొంతం చేసుకున్నాడు. మెహర్ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈసినిమాకు ప్రధాన బలం సుహాస్. ఒకరకంగా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. నిజానికి సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో షార్ట్ ఫిలింస్ లో తన నటనతో ఎంతో మందిని అప్పుడే ఆకట్టుకున్నాడు. చాలా సహజంగా ఉండే తన నటనతో అందరినీ ఆకట్టుకునే టాలెంట్ ఉన్న నటుడు సుహాస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదే నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలు సినిమాల్లో హీరోల ఫ్రెండ్ క్యారెక్టర్స్ అలానే పలు కీలక పాత్రల్లో నటించాడు. ఇక కలర్ ఫొటోతో హీరోగా అడుగుపెట్టిన సుహాస్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాతో మరో మెట్టు ఎక్కాడనిపిస్తుంది సుహాస్. నటుడిగా ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తున్నాడు సుహాస్. రామ్ అనే ఓ సైకో పాత్రలో సుహాస్ తప్ప ఇంకెవరూ ఆ పాత్రలో నటించలేరేమో అన్నంతగా నటించాడు. సినిమా చూస్తున్నంతసేపు సుహాస్ కాకుండా రామ్ అనే సైకో మాత్రమే తెరపై కనిపిస్తాడు. తన నటనను చూస్తే ప్రేక్షకులకు భయం కూడా కలుగుతుంది. లక్ష్మణ్ పాత్రలో కోల్డ్ బ్లడడ్ మర్డరర్ గా తేజ కాసారపు అలరిస్తాడు. తెలుగమ్మాయిలు పూజ, అనూషలు చక్కగా నటించారు. తల్లిదండ్రులుగా శృతి-సంజయ్ లు ఆకట్టుకుంటారు.
ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు మెయిన్ కావాల్సింది నేపథ్య సంగీతం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంత హైలెట్ గా ఉంటే థ్రిల్లర్ సినిమాల్లో సన్నివేశాలకు అంత బలం చేకూరుతుంది. ఈనేపథ్యంలోనే అజయ్ – సంజయ్ ఇచ్చిన సంగీతం హైలెట్ గా నిలిచింది. రెగ్యులర్ రొటీన్ మ్యూజిక్ ఇవ్వకుండా కొత్తగా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు బావున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘ఫ్యామిలీ డ్రామా’ తప్పకుండా నచ్చుతుంది. థ్రిల్ ఇచ్చే మూమెంట్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఓటీటీలో రిలీజ్ కాబట్టి మీరు కూడా ఈ థ్రిల్లర్ ను చూసి ఎంజాయ్ చేయోచ్చు..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.