టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు శాంతరూబేన్ జ్ఞానశేఖరన్ దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా తమిళ , తెలుగు భాషలలో తెరకెక్కనుంది.విజయ దశమి పండగ సందర్భంగా “ప్రొడక్షన్ నెం.30” అనే వర్కింగ్ టైటిల్‌తో మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఒక విభిన్నమైన ప్రేమకథ చిత్రంగా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. త్వరలోనే ఈ మూవీ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: