మొత్తానికి ఎంత తొందరగా సినిమా రిలీజ్ చేద్దామనుకుంటే అంత ఆలస్యం అవుతుంది అఖిల్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కరోనా వల్ల ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇక పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి రాగానే థియేటర్లు తెరుచుకోగానే సినిమా రిలీజ్ లు మొదలు పెట్టారు అందరూ. దీంతో ఎట్టకేలకు దసరా కానుకగా వచ్చే నెల అక్టోబర్ 8న ఈ సినిమా విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. అయితే మళ్లీ ఏమైందో తెలియదు కానీ మరోసారి రిలీజ్ డేట్ ను మార్చారు మేకర్స్. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 15న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుందని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరి ఈసారైనా ఫైనల్ గా రిలీజ్ అవుతుందా.. లేక మరోసారి మారుస్తారా చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Excited to meet you all in theatres,this Dusshera with your families for a wholesome entertainment!🤩 #MostEligibleBachelor in theatres from 𝐎𝐂𝐓 𝟏𝟓𝐭𝐡!🧡@AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @GA2Official @adityamusic pic.twitter.com/wuZoS6L8tE
— Pooja Hegde (@hegdepooja) September 26, 2021
కాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: