ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమతో అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో భీమ్లా నాయక్ సినిమా, హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈరెండు సినిమాలు అయితే సెట్స్ మీద ఉన్నాయి. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందే పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.. దాని తరువాత భీమ్లా నాయక్ ను స్టార్ట్ చేశాడు. అయితే కరోనా వల్ల రెండు సినిమాలకు బ్రేక్ పడగా.. భీమ్లా నాయక్ సినిమా మాత్రం ముందు షూటింగ్ ను రీ స్టార్ట్ చేసింది.ఇక ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోవడమే కాకుండా.. వరుస అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం ఇంతవరకూ మళ్లీ సెట్స్ మీదకు రాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ ను హరి హర వీరమల్లు మేకర్స్ కలిశారు. ఇక ఈ మీటింగ్ లో షూటింగ్ ను ఎప్పుడు స్టార్ట్ చేయాలో లాంటి విషయాలు చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తయింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్ జరిపి పూర్తిచేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు.భీమ్లా నాయక్’ చిత్రం షూటింగ్ పూర్తవగానే “హరిహర వీరమల్లు” చిత్రం షూటింగ్ ప్రారంభించటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇక “హరిహర వీరమల్లు” ను 2022 ఏప్రిల్ 29 న విడుదల చేయనున్నట్టు పవన్ బర్త్ డే రోజు ప్రకటించారు. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ గా జ్ఞానశేఖర్ వి.ఎస్ పని చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: