ఆర్ఎక్స్ 100 తో తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ మొదటి సినిమాతోనే నటుడిగా తనేంటో నిరూపించుకున్నాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో బిజీ అయిపోయాడు. హీరోగానే కాదు విలన్ గా కూాడా చేసి మెప్పించాడు. ప్రస్తుతం కార్తికేయ శ్రీ సరిపల్లి అనే డైరెక్టర్ రాజా విక్రమార్క అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. నీ సినిమాల ఛాయిస్ అంటే ఇష్టం కార్తికేయ..టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ వరుణ్ తేజ్ టీజర్ ను రిలీజ్ చేశాడు.
Here is the super intriguing teaser of #RajaVikraMarka
Love your choice of films @ActorKartikeya
Wishing you and the entire team all the best!!Teaser link:https://t.co/MOesNqYFS1@ActorKartikeya@actortanya @SriSaripalli_ @88Ramareddy @AdireddyT @prashanthvihari pic.twitter.com/fGKMW26vZc
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) September 4, 2021
కాాగా యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: