వివాహ భోజనంబు మూవీ రివ్యూ

Vivaha Bhojanambu Movie Review,Vivaha Bhojanambu Telugu Movie Review,Satya,Sundeep Kishan,Aarjavee,TNR,Sudharsan,Telugu Filmnagar,Vivaha Bhojanambu Movie Trailer,Vivaha Bhojanambu Review,Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Movie,Vivaha Bhojanambu Telugu Movie,Vivaha Bhojanambu Update,Vivaha Bhojanambu Telugu Full Movie,Vivaha Bhojanambu Movie Live Updates,Vivaha Bhojanambu Movie Story,Vivaha Bhojanambu Public Talk,Vivaha Bhojanambu Movie Public Talk,Vivaha Bhojanambu Movie Public Response,Satya Vivaha Bhojanambu Telugu Movie Review,Vivaha Bhojanambu Telugu Movie Review And Rating,Vivaha Bhojanambu Movie Rating,Vivaha Bhojanambu Movie Release Updates,Vivaha Bhojanambu Review And Rating,2021 Latest Telugu Movie Reviews,Vivaha Bhojanambu Movie Review And Rating,Vivaha Bhojanambu Telugu Movie Public Talk,Vivaha Bhojanambu 2021 Latest Telugu Movie,Sundeep Kishan Vivaha Bhojanambu,Vivaha Bhojanambu Latest Updates,Vivaha Bhojanambu Songs,Vivaha Bhojanambu Trailer,Satya New Movie,Satya Latest Movie,Satya Movies,Vivaha Bhojanambu Movie Updates,Satya Vivaha Bhojanambu Movie Review,Satya Vivaha Bhojanambu Movie,Latest Telugu Reviews,Latest Telugu Movie 2021,Vivaha Bhojanambu On Sony LIV,Sony LIV,Comedian Satya,Latest Telugu Movie Reviews,Vivaha Bhojanambu 2021,Vivaha Bhojanambu Public Response,Vivaha Bhojanambu Movie Public Response,#VivahaBhojanambu

రామ్ సుబ్బరాజు దర్శకత్వంలో కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా వివాహ భోజనంబు. ఇక ఈరోజు ఈసినిమా ఓటీటీ లో రిలీజ్ అయింది. మరి నిర్మాతగా సందీప్ కిషన్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా… సత్య మొదటిసారి హీరోగా చేసిన ఈసినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: సత్య, అర్జావీ రాజ్, సందీప్ కిషన్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్నార్, దయానంద్ రెడ్డి, వైవా హర్ష తదితరులు
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాత: కేఎస్ సినీష్, సందీప్ కిషన్
సినిమాటోగ్రఫి: ఎస్ మణికందన్
బ్యానర్స్: ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, సోల్జర్స్‌ ఫ్యాక్టరీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్

కథ

పత్తి గింజల మహేష్ (సత్య) ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. కానీ డబ్బు మాత్రం ఖర్చుపెట్టడు పక్కా పిసినారి. మరోవైపు గొప్పింటి అమ్మాయి అనిత (ఆర్జావీ)తో ప్రేమలో పడుతాడు. ఇక అనిత తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) మొదట పెళ్లికి అంగీకరించకపోయినప్పటికీ కూతురిపై ప్రేమతో మహేష్‌తో పెళ్లి చేస్తాడు. ఈనేపథ్యంలో మహేష్ ఇంటికి తన భార్య అనిత కుటుంబ సభ్యులంతా వస్తారు. సరిగ్గా అదే సమయంలోనే కరోనా వల్ల లాక్‌డౌన్ విధించడంతో అందరూ మహేష్ ఇంటిలో ఉండిపోతారు. దీంతో పిసినారి అయిన మహేష్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు..? వాళ్లను ఎన్ని ఇబ్బందులకు గురి చేశాడు..? చివరికి మారాతాడా లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కరోనా నేపథ్యంలో ఇప్పటివరకూ పలు సినిమాలే వచ్చాయి. అయితే కామెడీ ఎంటర్ టైనర్ లో మాత్రం రాలేదని చెప్పొచ్చు. ఈసినిమా ఇప్పుడు అదే జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కమెడియన్ సత్య హీరో.. అందులోనూ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న సినిమా కాబట్టి దాదాపు సినిమా మొత్తం కామెడీగానే ఉంటుంది. డైరెక్టర్ కూడా పెద్ద హడావుడి లేకుండా కామెడీ తోనే సినిమాను లాగించేశాడు. కరోనా వల్ల గతేడాది ఎదురైన వాస్తవ పరిస్థితుల ఆధారంగా భాను భోగవరపు కథను రాసుకోగా… దానికి తనదైన టైమింగ్‌తో ఎగ్జిక్యూట్ చేయడంలో రామ్‌ అబ్బరాజు విజయం సాధించాడని చెప్పొచ్చు.

సత్య కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఇక ఈసినిమాలో కూడా తన కామెడీ టైమింగ్‌తో నవ్వించాడు. అంతేకాదు సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్స్ సీన్స్ లోనూ నటనతో ఆకట్టుకొన్నాడు. ఇక హీరోయిన్‌గా ఆర్జావీ తన పాత్ర మేరకు బాగానే నటించింది. సత్య తరువాత శ్రీకాంత్ అయ్యంగార్ కి మంచి పాత్ర దక్కింది అని చెప్పొచ్చు. సత్య-శ్రీకాంత్ అయ్యంగార్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా కామెడీగా ఉంటాయి. సందీప్ కిషన్‌ కూడా ఒక చిన్న పాత్రలో నటించాడు. అంబులెన్స్ డ్రైవర్ నెల్లూరు ప్రభగా అదరగొట్టాడు. నెల్లూరు భాషలో మా నాయిన ఏం చెప్పాడంటే అంటూ వచ్చీ రానీ ఇంగ్లీష్ భాష మాట్లాడే డ్రైవర్‌గా ఉన్న కొంచం సేపు అయినా హైలెట్ అయ్యాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

ఫైనల్ గా ఈ సినిమా కుటుంబ సమేతంగా చూసే సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =