“ది ఫ్యామిలీ మ్యాన్’ హిందీ వెబ్ సిరీస్‌లు దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1” సంచలన విజయంతో “ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 “ను రాజ్ &డికె మరింత ఆసక్తిగా రూపొందించారు. బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్‌పాయి లీడ్ రోల్ లో నటించగా ప్రియమణి , సమంత లు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో సమంత శ్రీలంక మహిళ టెర్రరిస్టుగా అద్భుతంగా నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా జూన్ 3 వ తేదీ రిలీజ్ అయిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ రికార్డు స్టాయిలో విజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ది ఫ్యామిలీ మ్యాన్ 2’”ను తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. “ది ఫ్యామిలీ మ్యాన్ 2” తెలుగు వెర్షన్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో త్వరలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: