అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ కృష్ణ కురసాల దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరో గా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ డ్రామా “సోగ్గాడే చిన్నినాయనా “మూవీ ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది . హీరో నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో రమ్యకృష్ణ , లావణ్య త్రిపాఠి కథానాయికలు. “సోగ్గాడే చిన్నినాయనా “ మూవీ లో హీరో నాగార్జున బంగార్రాజు పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కనున్న “సోగ్గాడే చిన్నినాయనా “ సీక్వెల్ “బంగార్రాజు ” మూవీ లో హీరో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. నాగార్జున కు జోడీగా శ్రియ నటించనున్నట్టు , నాగచైతన్యకు జోడీగా బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ ఫేమ్ కృతి శెట్టి ఎంపిక అయినట్టు సమాచారం. ఆగస్ట్ 16 వ తేదీ నుండి “బంగార్రాజు ” మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది. హీరో నాగార్జున , శ్రియ జంటగా తెరకెక్కిన “నేనున్నాను “, “సంతోషం”, “మనం ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. నాగార్జున , శ్రియ జంటగా మరోసారి ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: