‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ముస్లిం క్యాప్ అందుకే పెట్టుకున్నాడు

KV Vijayendra Prasad Reveals The Reason Behind Jr NTR Wearing Muslim Cap In The RRR Movie,KV Vijayendra Prasad Reveals Why Jr NTR Aka Komaram Bheem Wears The Muslim Cap In RRR Teaser,Why Jr NTR Wears The Muslim Cap In The RRR Teaser,#KomaramBheemNTR,Roar Of RRR,RRR Movie,Komaram Bheem,Jr NTR Komaram Bheem,Telugu Filmnagar,RRR,RRR Update,RRR,Jr NTR,Jr NTR Movies,RRR News,RRR Movie Update,Jr NTR Latest News,RRR Movie Update,Jr NTR RRR Movie Update,RRR Movie Update Latest,RRR Movie News Update,RRR Movie News,RRR Movie Latest News,Jr NTR New Movie,NTR Movies,RRR Telugu Movie,RRR Latest Updates,Jr NTR Komaram Bheem Look,Jr. NTR,Ram Charan,Ajay Devgn,Alia Bhatt,SS Rajamouli,Jr NTR RRR Look,RRR Jr NTR Look,RRR Jr NTR Komaram Bheem Look,Komaram Bheem From RRR Movie,#RRR,#RRRMovie,Writer Vijayendra Prasad,Vijayendra Prasad,Vijayendra Prasad Movies,Vijayendra Prasad Latest News,Vijayendra Prasad News,Vijayendra Prasad Movie News,Vijayendra Prasad Movie Updates,Vijayendra Prasad About RRR Movie,Vijayendra Prasad About RRR,SS Rajamouli,Sitaramaraju Ram Charan,Komaram Bheem NTR,Vijayendra Prasad Latest Film Updates,Vijayendra Prasad Interview,Vijayendra Prasad Latest Interview,Vijayendra Prasad Speech,Reason Behind Jr NTR Wearing Muslim Cap In RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈసినిమాకు ప్రస్తుతం పాటలు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈనేపథ్యంలో నేడు అలియాభట్ కూడా ఆర్ఆర్ఆర్ సెట్స్ లో జాయిన్ అయింది. మరోవైపు ఇప్పటికే ప్రమోషనల్ సాంగ్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు దానికోసం స్పెషల్ గా అమిత్ త్రివేది కూడా ఈసినిమాలో పార్ట్ అయినట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటి వరకు వదిలిన మోషన్ పోస్టర్లు, ఇంట్రో టీజర్లు, పోస్టర్లు, రీసెంట్ గా రిలీజ్ చేసిన రోర్ ఆఫ్ ఆర్ఆర్ అన్నీ కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఈసినిమాపై అంచనాలు పెంచాయి. ఇదిలాఉండగా ఈసినిమా గురించి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పగా తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలిపారు. అదేంటంటే ఈసినిమాలో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసినప్పుడు అందులో ఎన్టీఆర్ ముస్లిం క్యాప్ ను పెట్టుకున్న సీన్ గుర్తుండే ఉంటుంది కదా. అప్పట్లో దీనిపై చర్చలు కూడా జరిగాయి. ఇక ఇప్పుడు దీనిపై విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ అసలు కారణం ఏంటో తెలిపాడు. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈనేపథ్యంలో అప్పట్లో ఉన్న నైజాంలు భీమ్ కోసం వెతుకుతుంటారని.. అయితే శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి, వారిని మభ్యపెట్టడానికి మాత్రమే ఎన్టీఆర్ ముస్లింక్యాప్ పెట్టుకుంటాడని అంతే కాని అందులో ఏం లేదని క్లారిటీ ఇచ్చాడు.

కాగా ఫిక్ష‌న్ క‌థాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here