దర్శకరత్న దాసరి నారాయణరావు , దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు , రవిరాజా పినిశెట్టి వంటి పలువురు తెలుగు దర్శకులు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో సత్తా చాటిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ “అర్జున్‌రెడ్డి”(2017) సందీప్ రెడ్డి వంగా హిందీలో షాహిద్ కపూర్‌తో “కబీర్ సింగ్ (2019)గా రీమేక్ చేసి, బాలీవుడ్‌లో నిరూపించుకున్నారు. ఇప్పుడు హిందీలో రణ్‌బీర్ కపూర్‌తో “యానిమల్” మూవీ ని సందీప్ తెరకెక్కిస్తున్నారు. పలువురు తెలుగు డైరెక్టర్స్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “ఛత్రపతి “హిందీ రీమేక్ తో వివి వినాయక్ , జెర్సీ మూవీ రీమేక్ “జెర్సీ “తో గౌతమ్ తిన్ననూరి , “హిట్ ” రీమేక్ మూవీ తో శైలేష్ కొలను , “మత్తువదలరా “రీమేక్ తో రితేష్ రాణా , మరోవైపు తొలి చిత్రం ‘ఘాజీ’తోనే జాతీయ అవార్డ్ సాధించిన యంగ్ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి విద్యుత్ జమాల్ హీరోగా”ఐబీ 71” అనే స్పై థ్రిల్లర్ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ పై ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: