క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా “శాకుంతలం” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాకు కరోనా బ్రేక్ వేయడంతో ఇన్ని రోజులు షూట్ కు ప్యాకప్ చెప్పారు. ఇక రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ఇక మరోవైపు ఈసినిమాలో అల్లు వారసురాలు అల్లు అర్హ తెరంగ్రేటం చేయబోతున్నట్టు కూడా ప్రకటించేశారు. ఇందులో రాజకుమారుడు భరతుడిగా ఆమె నటించబోతున్నట్టు తెలిపారు. ఓ10 రోజుల పాటు జరగనున్న షూటింగ్ లో అర్హ పాల్గొననుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎక్కువ శాతం సెట్స్ లోనే జరుగుతుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మాత్రం అవుట్ డోర్ లో జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం శాకంతలం హైద్రాబాద్ లోని గండిపేట లేక్ దగ్గర షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ లొకేషన్ షూటింగ్ లలో షూటింగ్ లను జరుపుకోవడం రద్దు చేసింది. దీంతో చిత్రయూనిట్ ప్రభుత్వ అనుమతి తీసుకొని మరి అక్కడ షూటింగ్ జరపనున్నారు. ఇతిహాసనేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే అంగీకరించినట్టు తెలుపుతున్నారు. త్వరలోనే సమంత తో పాటు చిత్రయూనిట్ అక్కడ షూటింగ్ జరపనున్నారట.
ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ వరకు ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే ప్లాన్ లో చిత్రయూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: