‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ న్యూ ఇండియన్ రికార్డ్

Roar Of RRR Sets A New Record On Youtube,Roar Of RRR Sets A New Indian Record,Roar Of RRR Clocked 6 Million Views On Youtube,Roar Of RRR 6 Million Views,Roar Of RRR 6M Views,Roar Of RRR Crossed 6M Views,Roar Of RRR Hits 6M Millions View,Roar Of RRR Completes 6M Views,Roar Of RRR Making 6 Million Views,Roar Of RRR Making New Record,RRR Movie Making Video,RRR Making Video,Making Video Roar Of RRR,Roar Of RRR,Roar Of RRR,Telugu Filmnagar,Roar Of RRR Video Update,Roar Of RRR,RRR Movie,Ram Charan,Roar Of RRR Update,Roar Of RRR Making Video,Roar Of RRR Movie Making,Roar Of RRR Movie,RRR Making Video,RRR Movie Updates,RRR New Updates,RRR Latest Updates,RRR Updates,Roar Of RRR Making,Jr NTR,NTR RRR,Rajamouli,Ram Charan RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Movie News,Ram Charan,Jr NTR,RRR,RRR Telugu Movie Updates,RRR,RRR,Seetha Rama Raju Charan,Komaram Bheem NTR,Roar Of RRR Movie Video,Roar Of RRR - RRR Making,NTR,Ajay Devgn,Alia Bhatt,SS Rajamouli,SS Rajamouli Movies,RRR,RRR NTR Teaser,RRR Ajay Devgn,RRR NTR,RRR Ram Charan,RRR Alia Bhatt,SS Rajamouli New Film,Rajamouli Next Movie,NTR In RRR,Ramaraju For Bheem,RRR Telugu NTR,DVV Movies,RRR Making,NTR In RRR Making,Ram Charan In RRR Making,RRR Movie Making,Olivia Morris,#RoarofRRR,#RRRMovie,#RRR

రాజమౌళికి కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయడం కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక బాహుబలి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత వచ్చిన సినిమాలు నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేశాయే తప్పా ఆ రేంజ్ రికార్డులను అందుకోలేకపోతున్నాయి. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో కూడా మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యాడు రాజమౌళి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ రాజమౌళి డైరెక్షన్ అవ్వడం.. దానికితోడు ఎన్టీఆర్-చరణ్ లాంటి స్టార్ హీరోలు ప్రధాన పాత్రలు కావడంతో సహజంగానే అంచనాలు ఉంటాయి. ఇక ఈసినిమా నుండి ఇప్పటివరకూ రాజమౌళి పోస్టర్లే రిలీజ్ చేయగా.. నిన్న రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ అంటూ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు. ఇక అలా రిలీజ్ చేశాడో అప్పుడే కొత్త రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ వీడియో రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్ తో పాటు దాదాపు 5 లక్షలకు పైగా లైక్ లను సొంతం చేసుకుంది. మేకింగ్ వీడియోకు ఈ రేంజ్ లో వ్యూస్ రావడం ఈ వీడియోకే చెల్లింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాజమౌళి దర్శకత్వంలో రియల్ కారెక్ట‌ర్స్‌తో కూడిన ఫిక్ష‌న్ క‌థాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా, ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి. డీవీవీ దాన‌య్య నిర్మిస్తోన్న సినిమా 2021అక్టోబ‌ర్ 13న రిలీజ్ కానుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =