బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ ” (2015) మూవీతో మలయాళ చిత్ర పరిశ్రమ కు కథానాయికగా పరిచయం అయిన సాయి పల్లవి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో సాయి పల్లవి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయిక గా రూపొందిన “లవ్ స్టోరీ “ ,”విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ సాయి పల్లవి ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
సాయి పల్లవి సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. సాయి పల్లవి ప్రస్తుతం “శ్యామ్ సింగ రాయ్” సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సోషల్ మీడియా లో తన ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న సాయి పల్లవి తాజాగా షూటింగ్ లొకేషన్ ఫోటోలను షేర్ చేశారు. కాళ్ళకు పారాణి తో ఉన్న సాయి పల్లవి ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. “శ్యామ్ సింగ రాయ్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: