ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కిన భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం ఎంత మంది ఎదురుచూస్తున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. హోంబలే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం .. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. మరోవైపు కె.జి.యఫ్ 2 తోపాటు ఇప్పటికే హోంబలే ఫిలిమ్స్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా నిర్మిస్తోంది. ఈసినిమా కూడా షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
We bring forward 𝐃𝐕𝐈𝐓𝐕𝐀.
A unique Psychological Drama Thriller starring @PuneethRajkumar, directed by @Pawanfilms.@VKiragandur @hombalefilms @HombaleGroup @DvitvaMovie @preethaj #PoornaChandraTejaswi @KRG_Connects #Dvitva #HombaleFilms pic.twitter.com/rWM7cMFcGE— Hombale Films (@hombalefilms) July 1, 2021
ఇక ఇదిలా ఉండగా కె.జి.యఫ్ ఘన విజయంతో హోంబలే ఫిలింస్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక దీనితో కె.జి.యఫ్ పార్ట్ 2 రిలీజ్ కాకముందే మరో భారీ సినిమాకు ప్లాన్ చేస్తుంది. ఈనేపథ్యంలోనే నేడు మరో కొత్త సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇచ్చారు చిత్రయూనిట్. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ లీడ్ రోల్ లో భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతుంది హోంబలే ఫిలింస్. ఈసినిమాకు ద్విత్వ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాను సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మూవీ కన్నడతోపాటు తెలుగులో కూడా విడుదల కానుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: