సురేష్ ప్రొడక్షన్స్ , వి క్రియేషన్స్ బ్యానర్స్ పై శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా యాక్షన్ డ్రామా”నారప్ప “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “అసురన్ “తమిళ మూవీ తెలుగురీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో కార్తీక్ రత్నం , ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , సంపత్ రాజ్ , మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అసురన్ “తమిళ మూవీని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కిస్తున్నారు. “నారప్ప “మూవీ లోని క్యారెక్టర్స్ అన్నీ అనంతపురం యాసలో డైలాగ్స్ పలకడానికి నటీనటులకు ఆ యాసలో నిపుణుల చేత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల శిక్షణ ఇప్పించారు. రాయలసీమలోని అనంతపూర్ పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించారు. “నారప్ప”మూవీ లో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ హైలైట్ కానుంది. వచ్చే వారం చిత్ర టీజర్ విడుదల కానున్నట్టు , టీజర్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందనీ సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: