మళ్లీ వింటేజ్ లుక్ తో మాస్ మహారాజా

Mass Maharaja Ravi Teja To Entertain Audience With His New Vintage Look In His Upcoming Movie,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja Upcoming Movies,Ravi Teja New Movie,Ravi Teja Latest Movie,Ravi Teja Latest Movie Updates,Ravi Teja New Movie Update,Ravi Teja Next Project Update,Ravi Teja Upcoming Projects,Ravi Teja Upcoming Movie,Mass Maharaja Ravi Teja,Ravi Teja New Vintage Look In His Upcoming Movie,Ravi Teja New Vintage Look For His Next,Ravi Teja New Vintage Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja In Vintage Look,Ravi Teja In Vintage Look,Ravi Teja In New Vintage Look,Ravi Teja Upcoming Movie Details,Ravi Teja Next Project Details,Ravi Teja Upcoming Movie Details

క్రాక్ సినిమాతో చాలా కాలం తరువాత హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు మాస్ మహారాజా రవి తేజ. ప్రస్తుతం రమేష్‌వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఖిలాడి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు అర్జున్, అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు శరత్ మండవతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా మొదలు పెట్టేలోపే సెకండ్ వేవ్ రావడం వల్ల షూటింగ్ ను మొదలపెట్టలేకపోయింది. అయితే ప్రీ ప్రొడక్షన్ మొదలు పెట్టి ఈసినిమాకుకావాల్సిన సెట్టింగ్ నిర్మాణాలు పూర్తి చేసే పనిలో చిత్రయూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక తాాజా సమాచారం ప్రకారం…ఇది కూడా ఒక పీరియాడికల్ కథ నేపథ్యంలోనే తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. 1990వ దశకం తొలినాళ్లలో జరిగిన ఒక యదార్థ ఘటన సినిమా కథకి ఆధారం అంటున్నారు. అందుకు తగ్గట్టే రవితేజ లుక్ కూడా మార్చబోతున్నాడట. అంటే, మాస్ మహారాజా వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నాడన్నమాట. అంతేకాదు వింటేజ్ లుక్ లో రవితేజ ఖచ్చితంగా అలరిస్తాడని చిత్రయూనిట్ నమ్మకంతో ఉంది. ఇప్పటికే అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఒక పాత్రలో వింటేజ్ లుక్ తో రవితేజ అలరించిన సంగతి తెలిసిందే.

ఇక సుధాకర్ చెరుకూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కేరళ కుట్టి రాజీషా విజయన్ హీరోయిన్ గా నటించవచ్చని అంటున్నారు. సామ్ సీఎస్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చూడాలి మరి, కొత్త రవితేజ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 5 =