గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈసినిమా షూటింగ్ మొత్తం ఎక్కువగా సెట్స్ లోనే జరుగుతుంది కాబట్టి ఇప్పటికే చాలా భాగం షూటింగ్ ను జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఇంత తొందరగా షూటింగ్ జరుపుకోవడానికి కారణం సమంత అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నాడు గుణశేఖర్. ఈ సినిమా షూటింగును మొదలుపెట్టిన దగ్గర నుంచి మే 10వ తేదీ వరకూ చిత్రీకరణ జరుగుతూనే వచ్చింది. ఆ తరువాత కరోనా ప్రభావం పెరగడంతో ఆపేశాము.ప్రస్తుతం మధ్యాహ్నం 1 గం. వరకు వెసులుబాటు లభించడంతో త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని.. షూటింగ్ ఇంత త్వరగా మొదలుపెట్టడానికి ముఖ్య కావడానికి కారణం సమంత – ప్రొడ్యూసర్ నీలిమ అంటున్నారు. నిర్మాతలకు నష్టం రాకూడదనే ఉద్దేశంతో, సమంత అందిస్తున్న సహాయ సహకారాలు మరువలేనివి. ఆమె వల్లనే 50 శాతం వరకూ చిత్రీకరణను పూర్తిచేయగలిగాము అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.
ఇక ఈసినిమాలో సమంత సరసన దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నాడు. మరో కీలక పాత్రలో అదితి బాలన్ కూడా నటిస్తుంది.. పాన్ ఇండియా లెవల్లో రూపొందిస్తున్న ఈ సినిమాను గుణ శేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: