మహేష్ ఫ్యామిలీ పర్సన్ అని అందరికీ తెలుసు. షూటింగ్ లేకపోతే ఫ్యామిలీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటాడు. ఇక గత ఏడాది కరోనా వల్ల ఇంట్లోనే ఉన్న మహేష్ బాబు పిల్లలతో సినిమాలు ఆటలు, బుక్స్ పలు వ్యాపకాలతో మంచిగా రిలాక్స్ అయ్యాడు. నాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నమ్రత ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంది. ఇక ఇటీవలే సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మొదలుపెట్టగా మళ్లీ కరోనా సెకండ్ వేవ్ వల్ షూట్ కు బ్రేక్ పడింది. దీంతో మళ్లీ మహేష్ ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా నమ్రత మహేష్-సితార కు సంబంధించి మరో ఫొటో యాడ్ చేయగా అది ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఆ ఫొటోలో సితార మహేష్ ఒడిలో పడుకొని ఉంటుంది. ఇక ఈ ఫొటో షేర్ చేసిన నమ్రత.. వేకువ ఝామున అలా కౌగిలించుకుని నిదురపోవడం మస్ట్.. అలా చేయకపోతే ఉదయమే నిదుర లేవలేం.. వేకప్ మంత్ర.. బేబి ఇన్ ఆర్మ్స్.. లవ్ అంటూ హ్యాష్ ట్యాగ్స్ ను జోడించారు.
View this post on Instagram
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరో నెలలో కరోనా ఉదృతి తగ్గితే జులై నుంచి షూటింగ్ ను ప్రారంభించాలని చూస్తున్నారు చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: