మెగాస్టార్ చిరంజీవి దాసరి నారాయణ మారణానంతరం ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారిన సంగతి తెలిసిందే. ఎన్నో విషయాలను చిరు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇండస్ట్రీకి ఏదైనా సమస్య ఉంటే తానే ముందుండి ఆ సమస్యను పరిష్కరిస్తున్నాడు. ఇక కరోనా సమయంలో సినీ కార్మికులకు బాసటగా నిలిచాడు. ఇక ఆయన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ప్రజలకు సైతం సేవ చేస్తున్నారు. ఇటీవల మరో నిర్ణయం తీసుకొని అందరి చేత ప్రశంసలు కూడా పొందారు. మరి ఆ నిర్ణయం ఏంటో మీకు కూడా తెలుసుకదా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా గట్టిగా ఉండటంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా విదితమే. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది తమ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈనేపథ్యంలోనే చిరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఇప్పటికే రెండు మూడు జిల్లాల్లో ఆ ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇంకా త్వరలోనే అన్ని జిల్లాలకు అందేలా ఏర్పాటు చేస్తున్నారు. అయితే చిరు చేసిన ఈపని చాలా మంది ప్రజలకు మాత్రం స్పూర్తి నిచ్చింది.
ఈనేపథ్యంలో ఓ చిన్నారి ఇన్ఫిరేషన్ తో చేసిన పని ఇప్పుడు చిరు మనసును హత్తుకుంది. ఓ చిన్నారి తను దాచుకున్న డబ్బుతో పాటు తన ఈ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌కు అయ్యే ఖర్చు కూడా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల కోసం ఇచ్చింది. ‘తను చుట్టూ ఉన్న సమాజం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం, సంబరం అవుతుంది అని వీడియో పోస్ట్ చేయగా అది
చిరు చూసి ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు, తను వ్యక్త పరుస్తున్న ఈ ప్రేమకు నేను నిజంగా ముగ్ధుడినైపోయాను. అన్షి చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది. నన్ను మరింత ఇన్స్‌పైర్ చేసింది. తన డ్రీమ్స్ అన్నీ నిజమవ్వాలని నేను విష్ చేస్తున్నా. ఆమె సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. భగవంతుడు ఈ చిన్నారి చేతుల మీదుగా మా ప్రయత్నానికి చేయూతనిస్తూ తన ఆశీస్సులను అందిస్తున్నాడని నేను భావిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అన్షి. హ్యాపీ బర్త్ డే. లవ్ యూ డార్లింగ్’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి ఆ వీడియోలో తెలియజేశారు.
What a beautiful gesture Anshi!! I am so touched.
You are a wonderful girl. God Bless you!! #AnshiPrabhala #ChiranjeeviOxygenBanks @Chiranjeevi_CT @AlwaysRamCharan pic.twitter.com/VTnQkHNDDP— Chiranjeevi Konidela (@KChiruTweets) June 1, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























