మొత్తానికి కరోనా టైమ్ లోనే సెలబ్రిటీల పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఈకరోనా సినిమా షూటింగ్ లకు ఏమోకానీ పెళ్లిళ్లకు మాత్రం బాగా పనికొస్తుంది. గత ఏడాది ఎంతో మంది హీరో హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోగా తాజాగా మరో హీరోయిన్ కూడా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి చేసుకొని షాకిచ్చింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కలువ కళ్ల సుందరి ప్రణీత సుభాష్. సడెన్‌గా ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుని అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ప్రణీత వివాహం.. బిజినెస్ మ్యాన్ నితిన్‌తో ఆదివారమే జరిగినట్లుగా తెలుస్తుంది. కరోనా నిబంధనలు పాటిస్తూ కేవలం అతికొద్దిమంది స్నేహితులు – సన్నిహితుల మధ్య ప్రణీత పెళ్లి చేసుకుంది. నితిన్- ప్రణీత వివాహానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. ఇక తన పెళ్లిపై స్పందించిన ప్రణీత ఇది లవ్ కమ్ అరెేంజ్డ్ మ్యారెజ్. చాలా కాలంగా నితిన్ నాకు తెలుసు. ఇక పెళ్లితో మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాక మా ఇరు కుటుంబాలకు విషయం చెప్పాం. వాళ్లు కూడా మా నిర్ణయం పట్ల చాలా సంతోషించారు. ఇక నా వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం నాకు అంతగా ఇష్టం ఉండదు. అందుకే ఎలాంటి హంగామా లేకుండా పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది.
నటి ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటించిన ప్రణిత బావ, అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం చిత్రాలతో మరింత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆమె హంగామా-2, భుజ్ అనే చిత్రాల్లో నటిస్తోంది. కన్నడలోనూ రమణ అవతార అనే చిత్రంలో నటిస్తుంది మరి వివాహం తర్వాత ఆమె సినిమాలు చేస్తుందో.. లేదో? అనే విషయం తెలియాల్సి ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: