తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు . తమన్నా ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ హవా పెరిగిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్రేక్షకులు ఆస్వాదించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయనీ , అలాగే నటీనటుల స్టార్‌డమ్ విషయంలో కూడా ఈ తరం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి మారుతోందనీ తమన్నా అంటున్నారు. ఒకప్పుడు జస్ట్ ప్రతిభ ఉంటేనే ఫ్యాన్స్ అయిపోయేవారనీ కానీ ఇప్పుడు నటీనటుల ప్రతిభని మాత్రమే చూసి ఫ్యాన్స్ అయిపోవడంలేదనీ , ప్రతిభతో పాటు కొత్తదనానికి తగ్గ పాత్రలు చేసినప్పుడే యాక్టర్స్ , ఫ్యాన్స్ అభిమానాన్ని పొందగలుగుతున్నారనీ ,తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటి పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు డిఫరెంట్‌గా ఉండేదనీ , ఆ తరం అభిమానులతో పాటు ఈ తరం ప్రేక్షకుల అభిమానాన్ని కూడా తాను పొందగలగడం తన లక్’’ అనీ తమన్నా చెప్పారు. తమన్నా నటించిన “లెవెన్త్ అవర్”, “నవంబరు స్టోరీ” వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: