‘ఏక్ మినీ కథ’ రివ్యూ

Read Through The Ek Mini Katha Movie Review Released On Amazon Prime Video Today,Ek Mini Katha Telugu Movie Review,Ek Mini Katha,Santosh Shoban,Kavya Thapar,Shraddha Das,Karthik Rapol,Santosh Shoban Ek Mini Katha Movie Review,Santosh Shoban Ek Mini Katha Telugu Movie Review,Actor Santosh Shoban,Santosh Shoban Ek Mini Katha,Telugu Filmnagar,Ek Mini Katha,Ek Mini Katha 2021,Ek Mini Katha Film Updates,Ek Mini Katha Movie,Ek Mini Katha Movie Live Updates,Ek Mini Katha Movie Public Response,Ek Mini Katha Movie Public Talk,Ek Mini Katha Movie Public Talk And Public Response,Ek Mini Katha Movie Review,Ek Mini Katha Movie Review And Rating,Ek Mini Katha Movie Story,Ek Mini Katha Movie Updates,Ek Mini Katha Review,Ek Mini Katha Review And Rating,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Telugu Movie Latest News,Ek Mini Katha Telugu Movie Latest Update,Ek Mini Katha Telugu Movie Live Updates,Ek Mini Katha Telugu Movie Review And Rating,Ek Mini Katha Telugu Movie Updates,#EkMiniKathaOnPrime

కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్ శోభన్ హీరోగా బోల్డ్ కంటెంట్ తో ఏక్ మినీ కథ అనే సినిమా వస్తుంది. కావ్య థాపర్ హీరోయిన్ గా వస్తున్న ఈసినిమాను యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించింది. ఇక ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో నేడు రిలీజ్ అవ్వగా ఈసినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: సంతోష్ శోభన్, కావ్య థాపర్, బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, సుదర్శన్‌, పోసాని, శ్రద్ధాదాస్‌, సప్తగిరి తదితరులు
డైరెక్టర్ : కార్తీక్ రాపోలు
కథ: మేర్లపాక గాంధీ
సంగీతం: ప్రవీణ్‌ లక్కరాజు
సినిమాటోగ్రాఫర్: గోకుల్‌ భారతి
బ్యానర్స్: యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా

కథ.. సంతోష్‌ (సంతోష్ శోభన్)‌ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఏదో చిన్న జాబ్ చేస్తుంటాడు. అయితే తనకు తన చిన్నప్పటినుండి తన పురుషాంగం చిన్నగా ఉంటుందనే డౌట్ మాత్రం వెంటాడుతుంటుంది. మరోవైపు అమృత (కావ్య థాపర్)తో ప్రేమలో పడతాడు. తమకు పెళ్లి అప్పుడే ఇష్టంలేకపోయినా చేసుకోవాల్సి వస్తుంది. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పెళ్లి తర్వాత తను సంసారానికి పనికి వస్తానా లేదా అనే మానసిక భయం మరింత పెరుగుతుంది. ఇలాంటి సమస్యల మధ్య అమృత, సంతోష్ మధ్య విభేదాలు పెరిగి విడిపోతారు? సంతోష్‌కు పురుషాంగం చిన్నగా ఉందనే సమస్య తనలో ఎలా పెరిగింది? ఆ తర్వాత తన పరిష్కారం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరకు సంతోష్‌కు ఆ సమస్య తీరిందా? సంతోష్, అమృత ఒక్కటయ్యారా? అనేదే ఏక్ మినీ కథ.

విశ్లేషణ..

ప్రస్తుతం టాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ తో ఉన్న సినిమాలను బాగానే తీస్తున్నారు. ఇక ఏక్ మినీ కథ కూడా బోల్డ్ కంటెంట్ సినిమా అని ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ లతో అర్థమయ్యేఉంటది. నిజానికి కమర్షియల్ సినిమాలు తీయాలంటేనే చాలా ఈజీ ఇలాంటి సినిమాలు తీయాలంటేనే కత్తిమీద సాము లాంటివి. ప్రేక్షకులు సినిమాను చూసే తీరు మారిపోయింది అనుకున్నా మన తెలుగు ప్రేక్షకుల దగ్గరకు వచ్చే సరికి కొంచం కష్టమే. ఎందుకంటే కథలో బోల్డ్ నెస్ ను ఒప్పుకుంటారు కానీ.. అదే శృతి మించితే మాత్రం విమర్శలపాలు చేస్తారు. అయితే డైరెక్టర్ కార్తీక్ ఆ విషయంలో బాగానే జాగ్రత్రలు తీసుకున్నాడు. అడ‌ల్ట్ కంటెంట్ అయినా దానికి కామెడీని యాడ్ చేసి స‌ర‌దా స‌న్నివేశాల‌తో న‌డిపించేశాడు ద‌ర్శ‌కుడు.

ఒక రకంగా ఇది అటు రచయితకు, డైరెక్టర్ కు పెద్ద పరీక్షే. కానీ రచయితగా దర్శకుడు మేర్లపాక గాంధీ, దర్శకుడు కార్తీక్ రాపాక కథను సరిగా డీల్ చేయడంతో వారి ప్రతిభకు అద్దం పట్టింది. నిజానికి ఇలాంటి విషయాల గురించి అంత పబ్లిక్ గా మాట్లాడలేరు.. అలాంటి చర్చించలేని పాయింట్‌ను తీసుకొని వెండితెర మీద దానిని ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సెన్సిటివ్‌గా చూపించడానికి చేసిన ప్రయత్నం ఇంప్రెస్ చేస్తుంది.

ఈ సినిమాను సంతోష్ ఒప్పుకోడానికే చాలా ధైర్యం చేసినట్టు. సహజంగా ఇప్పుడున్న హీరోల్లో ఇలాంటి కథతో సినిమా చేయడానికి ముందుకు రారు. ఇక సంతోష్ చాలా ఈజ్‌తో త‌న పాత్ర‌ని చేసుకుంటూ వెళ్లిపోయాడు. త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌, డైలాగ్ డెలివ‌రీ అన్నీ చ‌క్క‌గా స‌రిపోయాయి. కావ్య థాప‌ర్ ఓకే అనిపిస్తుంది. సుద‌ర్శ‌న్ కామెడీ కూడా ఈసినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు. హీరో త‌ర‌వాత‌.. క‌థ‌ని న‌డిపించేది త‌నే. శోభ‌న్ తండ్రిగా బ్ర‌హ్మాజీ న‌ట‌న కూడా మెప్పిస్తుంది. శ్ర‌ద్ధాదాస్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక విభాగానికి వస్తే గోకుల్‌ భారతి సినిమాటోగ్రఫి, ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం ఆకట్టుకొనే అంశాలు. రీరికార్డింగ్ సినిమాకు ప్లస్ అయింది. యూవీ క్రియేషన్ బ్యానర్ నుంచి సినిమా అంటే భారీ బడ్జెట్ అనే ఫీలింగ్ ఉంటుంది. కాకపోతే పరిమితమైన బడ్జెట్‌తో మ్యాంగో మాస్ మీడియా సంస్థతో కలిసి ఏక్ మినీ కథను తీసిన పెద్ద చిత్రంగా మలచడానికి చేసిన ప్రయత్నం బాగుంది.

ఇక ఫైనల్ గా చెప్పాలంటే.. ఫ్యామిలీ అందరితో కలిసి చూసే సినిమా కాకపోయినప్పటికీ కామెడీ చిత్రాలను ఆదరించే వారికి, విభిన్నమైన కథల కోసం ఎదురు చూసే వారికి ఏక్ మినీ కథ తప్పకుండా నచ్చుతుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here