మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా కర్ణన్. కర్ణన్ గ్రామంలోని ప్రజల హక్కుల కోసం పోరాడే యువకుడి పాత్రలో జీవించేశాడు ధనుష్. యాక్షన్ డ్రామాగా తరకెక్కిన ఈసినిమా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకులు ప్రశంసలు కూడా దక్కించుకుంది. బాక్సాపీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈసినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈసినిమా తెలుగు హక్కులు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ దక్కించుకున్నాడట. ఈనేపథ్యంలో టాలీవుడ్ యువహీరో బెల్లకొండ సాయిశ్రీనివాస్ ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తాడని ఫిలింనగర్ సర్కిల్‌లో జోరుగా చర్చ నడుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాకు సంబంధించిన పనులు మొదలైనట్టు తెలుస్తోండగా..డైరెక్టర్ ఎవరనేది కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు సమాచారం. మరి ఈ ఛాలెంజింగ్ రోల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎలా నటిస్తాడో చూడాలి. మరోవైపు బెల్లంకొండ ఛత్రపతి హిందీ రీమేక్‌లో నటిస్తున్నాడు. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: