‘చూసీ చూడంగానే’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమే.. రెండో సినిమా ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష బొల్లమ్మ. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తుంది. మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న సినిమా `స్టాండప్ రాహుల్`. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ లో ఉన్న వర్ష బొల్లమ్మ తను సెట్ లో చేసిన ఫన్ వీడియో ఒకటి తన ఇన్ట్సా ద్వారా తెలిపింది. ఇక ఈవీడియోలో వర్ష రకరకాల ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఫన్ చేస్తుంది. ఇక ఈవీడియోకు సెట్ లో నన్ను నేను ఇలా ఎంటర్ టైన్ చేసుకుంటా.. అంతేకాకుండా మీమ్ పేజెస్ కు కూడా కొన్ని మీమ్స్ కనిపెడుతున్నా అంటూ పోస్ట్ లో పేర్కొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఇక ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో వెన్నెలకిషోర్, మురళిశర్మ, ఇంద్రజ, దేవీ ప్రసాద్ మరియు మధురిమ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం, శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: