ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలతో కెరీర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకున్న సందీప్ కిషన్ మధ్యలో కాస్త వరుస పరాజయాలతో కెరీర్ లో తడబడ్డాడు. మళ్లీ ఈమధ్య నిను వీడని నీడను నేనే, ఏ1 ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాలతో ఫామ్ లోకి వచ్చి.. వరుస సినిమాలతో దూసుకెళుతున్నాడు. ఈ సారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సందీప్ కిషన్. సీనియర్ డైరెక్టర్ నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ గల్లీ రౌడీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక మే 21న సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈనేపథ్యంలోనే టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 19న సాయంత్రం 5గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టాలీవుడ్ లో ముద్దుగా రౌడీ హీరో అని పిలుచుకునే విజయదేవరకొండ చేత టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Our own 𝑹𝑶𝑾𝑫𝒀 @TheDeverakonda launching the craziest teaser of #GullyRowdy on 19th Apr, 5PM.
Stay excited🤩#GullyRowdyTeaser@sundeepkishan @actorsimha #NehaHarirajShetty #GNageswaraReddy #RamMiryala @iamsaikartheek @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp @MangoMusicLabel pic.twitter.com/lg0Dfcp7Ub— KonaFilmCorporation (@KonaFilmCorp) April 15, 2021
కాగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతేకాదు తమిళ స్టార్ యాక్టర్ బాబీ సింహా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కోన వెంకట్ కథను కూడా అందిస్తున్నాడు. చౌరస్తా రామ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: