ఉగాది సినిమాల ట్రీట్ అదిరింది

Tollywood Film Makers Treat Telugu Audience With Their Movie Updates On Ugadi Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ugadi,Happy Ugadi,Happy Ugadi 2021,Ugadi 2021,Ugadi 2021 Movie Updates,Movie Updates On Ugadi Festival,Movie Updates On Ugadi 2021,Telugu Movie Updates On Ugadi Festival,Happy Ugadi New Posters From Tollywood Films,Latest Movie News and Updates on Ugadi,F3 Movie,Tuck Jagadish,Seetimaarr,Son of India,BLACK,Aadi Black Movie,101 Jillala Andagadu,Thimmarusu,Virata Parvam,Ugadi 2021 Tollywood Movie Updates,Movie Updates,Telugu Movie Movie Updates,Telugu Movies For Ugadi,2021 Tollywood Latest Updates,Tollywood

ఏదైనా పండగ వచ్చిదంటే చాలు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా లేని సందడి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సినిమాల నుండి అప్ డేట్ ఇస్తూ ఫ్యాన్స్ కు అసలైన ట్రీట్ ఇస్తారు. ఇక నిన్న ఉగాది.. తెలుగు కొత్త సంవత్సరం. ఈ పండుగ సందర్బంగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. మరి ఏయే సినిమా నుండి ఏ పోస్టర్లు, అప్ డేట్స్ వచ్చాయో ఒక లుక్కేద్దాం…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా నుండి ఉగాది అప్ డేట్ ఇచ్చేశారు. పండుగ సందర్భంగా ఈసినిమా కొత్త షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు.

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేశారు చిత్రయూనిట్. ఇక ఉగాది పండుగ రోజు సందర్భంగా ఈసినిమా నుండి కూడా మంచి ఫ్యామిలీ ఫొటో ఒకటి షేర్ చేశారు చిత్రయూనిట్. అందరూ నవ్వులు చిందిస్తోన్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది.

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా సీటీమార్. ఈసినిమా నుండి మాస్‌ లుక్‌ను రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్. ‌ఐదుగురు ఆడవాళ్లు బైక్‌ నడుపుతున్న పోస్టర్‌ను రిలీజ్‌ చేయగా విజిల్ కొడుతున్నారు నెటిజన్లు.

మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా నుండి ఉగాది పోస్టర్ వచ్చేసింది. మోహన్ బాబు ప్రధాన పాత్రలో వస్తున్న ఈసినిమా నుండి మోహన్ బాబు సోలో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈలుక్ కూడా నెటిజన్ల ను ఆకట్టుకుంటుంది.

ఇటీవల శశి సినిమాతో ఆకట్టుకున్న ఆది ఇప్పుడు మరో థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. జి.బి కృష్ణ దర్శకత్వంలో బ్లాక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా నుండి ఆది స్పెషల్ పోస్టర్ న రిలీజ్ చేశారు. పోలీస్ డ్రస్ లో ఉన్న ఆది లుక్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వంలో అవసరాల శ్రీనివాస్, రుహనీ శర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘101 జిల్లాల అందగాడు’. ఈ సినిమా నుండి ఉగాదికి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

సత్యదేవ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తిమ్మరుసు. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి సత్యదేవ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. చిక్కుముడులను విప్పేందుకు తీక్షణంగా ఆలోచిస్తున్నట్లున్న కనిపిస్తున్న ఈ లుక్‌ ఉగాది పచ్చడిలా బాగుందంటున్నారు సినీ లవర్స్‌.

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా విరాట పర్వం. ఉగాది పర్వదినాన ఈసినిమా నుండి కూడా స్పెషల్‌ పోస్టర్‌ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్‌. సాయిపల్లవి కడప మీద ముగ్గు వేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =