శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా మేజర్. ముంబై తీవ్రవాద దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్12వ తేదీన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఇప్పటికే అడివి శేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అడివి శేష్ లుక్ అచ్చం ఉన్ని కృష్ణన్ లాగే ఉండటంతో బాగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రమోద అనే పాత్రలో శోభిత నటిస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలియజేశారు.
She did not know bravery, until there was no choice. @sobhitaD is Pramoda.#MajorTeaserOnApril12 🔥#PeopleOfMajor #MajorTheFilm@AdiviSesh @saieemmanjrekar @sonypicsfilmsin @sonypicsindia @GMBents @urstrulyMahesh @AplusSMovies @SashiTikka @vivekkrishnani @prakashraaj pic.twitter.com/poL0wdl5U7
— GMB Entertainment (@GMBents) April 9, 2021
కాగా ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, సోనీ పిక్చర్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత సక్సెస్ అందిస్తుందో చూద్దాం.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: