సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే ఒక జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “ఆచార్య “మూవీ లోని ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నారు. “ఆచార్య “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ రోజు నుండి హీరో రామ్ చరణ్ ఫైనల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ తో రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని సమాచారం. దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























