ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ చాలా షార్ట్ గ్యాప్ తోనే రంగ్ దే సినిమాతో వచ్చేశాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్, కీర్తి సురేష్ నటించిన సినిమా రంగ్ దే. పోస్టర్లు, టీజర్లు సినిమాపై భారీగానే హైప్ క్రియేట్ చేశాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటించగా. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పి సి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈసినిమా నేడు రిలీజ్ అయింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ డీటెయిల్స్ :
స్టెరిన్గ్ : నితిన్ ,కీర్తి సురేష్
డి ఓ పి : పి సి శ్రీరామ్
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
ఎడిటింగ్ : నవీన్ నూలి
ఆర్ట్ : అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ : సతీష్ చంద్ర పాసం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :యస్ వెంకట రత్నం
ప్రెసెంటెడ్ బై పి డి వి .ప్రసాద్
ప్రోడ్యుస్డ్ బై సూర్య దేవర నాగ వంశీ
రిటన్ అండ్ డైరెక్ట్డ్ బై వెంకీ అట్లూరి
కథ..
అర్జున్ (నితిన్) చిన్నప్పుటి నుండి చదువులో వెనుకే. మరోవైపు అర్జున్ పక్కింట్లో ఉండే అను మాత్రం ఎప్పుడూ టాపే. ఈ విషయంలో అను వల్ల అర్జున్ కు ఎప్పుడూ తిట్లే. అందుకే చిన్నప్పటి నుండి అను అంటే అర్జున్ కు నుండి కోపం ఉంటుంది. వయసుతో పాటు ఆకోపం కూడా అలానే పెరుగుతుంది. అయితే అర్జున్ తో ఎంత కోప్పడినా అనుకు మాత్రం అర్జన్ అంటే ఇష్టమే. అయితే ఈ ఇద్దరు అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లిచేసుకోవాల్సి వస్తుంది. మరి వివాహం తర్వాత కూడా ఇద్దరూ గొడవ చేస్తూనే ఉంటారా? అను అంటే అస్సలు పడని అర్జున్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు.? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా అన్నది కథ.
విశ్లేషణ..
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను లాంటి సినిమాల తరువాత తన మూడో సినిమా కూడా ప్రేమ కథనే తీసుకున్నాడు వెంకీ అట్లూరి. ప్రేమకథకు మంచి కామెడీ ను కూడా జోడించి.. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. మనం నిజ జీవితంలో కూడా మనల్ని వేరే వాళ్లతో పోల్చడం చూసే ఉంటాం. అలాంటడప్పుడు మనకు కోపం రావడం సహజం. ఇక్కడ ఈసినిమా నేపథ్యంలో కూడా అలాంటిది. అలాంటి అస్సలు పడని ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది సారాంశం. పాయింట్ చిన్నదే అయినా డైరెక్టర్ దానిని తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సరదాగా కామెడీ వే లో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో పెళ్లి తరువాత ఫైటింగ్స్ తో పాటు ఎమోషన్స్ తో వర్కవుట్ చేశాడు.
ముఖ్యంగా ఈసినిమాకు ప్రెష్ కాంబినేషన్ నితిన్-కీర్తి సురేష్ పెద్ద ప్లస్ పాయింట్. అను, అర్జున్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. అంతేకాదు ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కవుట్ అయింది. నిజానికి నితిన్ కు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. అందుకే చాలా ఈజ్ తో చేసేశాడు. తన ఫన్నీ చేష్టలు, డైలాగ్ మాడ్యులేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చాలా బాగా చేసాడు నితిన్. కీర్తి సురేష్ కు మాత్రం అను పాత్ర కెరీర్ లో బాగా ఉపయోగపడే పాత్ర అవుతుందని చెప్పొచ్చు. తెలుగులో ఇప్పటి వరకూ మ్యాగ్జిమమ్ సైలెంట్ గా సెటిల్డ్ గా ఉండే పాత్రలే చేసింది. ఈసినిమాలో అను పాత్ర కీర్తి సురేష్ ఎంత యాక్టివ్ గా చేయగలదో కూాడా చూపించింది. అల్లరి పిల్ల అను పాత్రలో చక్కగా నటించి ఆకట్టుకుంది కీర్తిసురేష్. ఎమోషనల్ సీన్స్ ఎలాగూ బాగానే చేస్తుంది.. ఈసినిమా లోను ఎమోషన్స్ సీన్స్ లో తనదైన నటనతో ఆకట్టుకుంది.
ఇక నరేష్ నితిన్ కు తండ్రిగా ఎప్పటిలాగే తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఈ సినిమాకు వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం కామెడీ ప్రధాన ఆకర్షణ. సుహాస్‌తో కలిసి అభివన్ తొలి భాగంలో తన మార్కును చూపించగా… సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ మరోసారి కామెడీ టైమ్‌తో ఆకట్టుకొన్నాడు. వినీత్, సత్యం రాజేశ్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రాసాద్ సంగీతం మరో ప్లస్ పాయింట్. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే రంగ్ దే లవ్, కామెడీ, ఎమోషన్స్ కలగలిసిన మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: