ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘అరణ్య’. తమిళ్‌లో కదన్ పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇంకా ఈ సినిమాలో శ్రియ పిల్ గోవింకర్, పులకిత్ సామ్రాట్, పోసాని, విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించగా.. ఈ సినిమాను ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మించారు. శాంతాను మొయిత్రా సంగీతం అందించగా.. ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ చిత్రంలో తన జీవితాన్ని ఎక్కువగా అడవికే అంకితం చేసి, అక్కడ నివసించే జంతువులను కాపాడాలనే ఏకైక లక్ష్యంతో ఉండే బాణదేవ్ పాత్రలో రానా నటించాడు. మరి ఈసినిమా ఈరోజు రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ డీటెయిల్స్ :
మూవీ నేమ్ : అరణ్య ( తెలుగు )
కాస్ట్ : రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్,విష్ణు విశాల్,శ్రియ పిల్ గోవింకర్
ప్రొడ్యూస్డ్ : ఈరోస్ మోషన్ పిక్చర్స్
డైరెక్ట్డ్ : ప్రభు సోలమన్
స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే : ప్రభు సోలమన్
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : వనమాలీ
డి ఓ పి : ఎ ఆర్ .అశోక్ కుమార్
మ్యూజిక్ : శాంతను మొయిత్ర
సౌండ్ డిజైన్ : రెసుల్ పూకుట్టి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : శాంతాను మొయిత్రా అండ్ జియోర్జి జోసెఫ్
ఎడిటర్ : భువన్
ప్రొడక్షన్ డిజైన్ : మయూర్ శర్మ
కాస్ట్యూమ్స్ : కృతి కోల్వాన్కర్ అండ్ మారియా తారకన్
కథ..
విశాఖపట్టణానికి సమీపంలో చిలకల కోన అనే అడవి ఉంటుంది.ఆ అడవిలోనే పుట్టిపెరుగుతాడు నరేంద్ర భూపతి (రానా ). ఆయన తాత జయేంద్ర భూపతి 500 ఎకరాల అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వానికి రాసిచ్చేస్తే.. ఆ అడవికి నరేంద్ర భూపతి సంరక్షకుడిగా ఉండిపోతాడు. అడవి, ఏనుగుల రక్షణ కోసం పాటు పడుతున్నందుకు ఫారెస్ట్ మేన్‌గా రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకుంటాడు నరేంద్ర భూపతి. మరోవైపు కేంద్రమంత్రి కనకమేడల రాజగోపాలం (అనంత్ మహదేవన్) ఆ అడవిపై కన్నేస్తాడు. అడవిలో 60 ఎకరాలలో డీ.ఎల్.ఆర్ టౌన్‌షిప్ కట్టాలని ప్లాన్ చేసుకుంటాడు. ఈ క్రమంలో ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ ఏర్పాటు చేస్తాడు. మరి ఈ టౌన్‌షిప్‌ను అరణ్య ఎలా అడ్డుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కేంద్రమంత్రిపై ఎలా పోరాటం చేసాడు అన్నది మిగిలిన కథ.
విశ్లేషణ..
నేచర్ ను కాపాలంటూ ఇప్పటికే ఎన్నో పోరాటాలు జరిగాయి.. జరుగతూనే ఉన్నాయి. అలాంటి పాయింట్ తోనే ఈసినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్. ప్రేమఖైదీ’, ‘గజరాజు’వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ సబ్జెక్ట్‌ని ఎంచుకోవడంతో ‘అరణ్య’పై అంచనాలు పెరిగాయి. ఆ సినిమాలను ఎంత నేచురల్ గా చూపించాడో ఈసినిమాను కూడా అలానే చూపించాడు. ప్రకృతి విలువేంటో ఈ సినిమాతో మరోసారి అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు.
హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర కోసం ఏమైనా చేస్తాడు రానా. అందుకే ఇండస్ట్రీలో కాస్త డిఫరెంట్ గా సినిమాలు.. పాత్రలు చేస్తాడని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసినిమాకు కూడా రానానే ప్రధాన బలం. సినిమాను మొత్తం తన భుజాలపైనే నడిపించాడు. ఒక రంకగా రానా వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఒక సినిమా కోసం రానా ఎంత కష్టపడతాడో.. తన మేకోవర్ ను ఎలా మార్చుకుంటాడో ఇప్పటికే పలు సినిమాల్లో చూశాం. ఈసినిమా కోసం కూడా రానా చాలా బరువు తగ్గి తన మేకేవర్ మొత్తం మార్చేశాడు. బాహుబలి సినిమా కంటే ఈసినిమానే కష్టం అనిపించింది అని రానా అన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత కష్టపడ్డాడో.. చెట్లు, ఏనుగుల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా అరణ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు రానా.
సింగ పాత్రకు విష్ణు విశాల్ న్యాయం చేశాడు. విలేకరిగా శ్రీయా పింగోల్కర్, నక్సలైట్‌గా జోయా హుస్సేన్ పాత్రల నిడివి తక్కువే అయినా.. పర్వాలేదనిపించారు. ఇక విలన్ పాత్రలో మహదేవన్ ఒదిగిపోయాడు. కమెడియన్ రఘుబాబు నిడివి తక్కువే అయినా.. ఉన్నంతసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
ఈ సినిమాలో రానా తరువాత చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. కెమెరామెన్ అశోక్‌కుమార్ అడవి అందాల్ని అద్భుతంగా చూపించారు. అలాగే, నేపథ్య సంగీతం కూడా సినిమాకు మరో బలం. శంతను మొయిత్రా, జార్జ్ జోసెఫ్ సంయుక్తంగా నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ విలువలు ఎంత గొప్పగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే రానా కోసం.. కాస్త డిఫరెంట్ గా సినిమాలు చూసేవాళ్లకి ఈసినిమా నచ్చుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: