ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణ లో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ దర్శకత్వంలో సమంత , దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ సెట్స్ లో దుష్యంతుడు గా నటిస్తున్న దేవ్ మోహన్ మంగళవారం జాయిన్ అయ్యి శాకుంతలం రోలింగ్ అంటూ ట్వీట్ చేశారు. శకుంతల గా నటిస్తున్న సమంత త్వరలోనే సెట్స్ లో జాయిన్ అవుతారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శాకుంతలం “మూవీ ప్రారంభ సమయంలో సమంత మాట్లాడుతూ .. అన్ని పాత్రలలోనూ నటించానుగానీ , పౌరాణిక పాత్రలో నటించలేదనీ , తన డ్రీమ్ రోల్ పీరియాడికల్ రోల్ అనీ , శకుంతల పాత్రను పోషించడం ఆనందంగా ఉందనీ , తన కెరీర్ లో శకుంతల పాత్ర మరిచిపోలేని గొప్ప బహుమతి అనీ చెప్పిన విషయం తెలిసిందే. దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ .. మహాభారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుందనీ , కాళిదాసు రచించిన గ్రేటెస్ట్ కథలలో శాకుంతలం ఒకటనీ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “శాకుంతలం ” మూవీ 2022 సంవత్సరం లో రిలీజ్ కానుందనీ చెప్పారు.
[subscribe]



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: