14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై కిషోర్ బి దర్శకత్వంలో శర్వానంద్ , ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా రైతు సమస్యల నేపథ్యం లో రూపొందిన “శ్రీకారం “మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది . సందేశాత్మక చిత్రం గా రూపొందిన ఈ మూవీ లో సాయి కుమార్ , మురళీశర్మ , రావు రమేష్ , నరేష్ , ఆమని ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. హీరో శర్వానంద్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్రీకారం “మూవీ ని స్పెషల్ స్క్రీనింగ్ లో వీక్షించిన ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆ మూవీ పై ప్రశంసలు కురిపించారు. వ్యవసాయం పునర్ వైభవం కోసం గ్రామాలకు తరలాలి అనే స్ఫూర్తి ని కలిగించే చిత్రమనీ , ఆత్మ విశ్వాసం తో అన్నదాత ముందుకు వెళ్ళవచ్చనే చక్కని సందేశం అందించారనీ , యువత చూడాల్సిన చిత్రమనీ వెంకయ్య నాయుడు “శ్రీకారం “మూవీ ని కొనియాడారు .
అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా దర్శకుడు కిషోర్ “శ్రీకారం “మూవీ ని తెరకెక్కించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: