నరేష్ కుప్పిలి దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘పాగల్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. విశ్వక్ సేన్ గత చిత్రాలకు భిన్నంగా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ను కూడా రిలీజ్ చేసినా ఇప్పటివరకూ ఈసినిమాలో నటించే హీరోయిన్ ను మాత్రం చిత్రయూనిట్ ప్రకటించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఆ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమాలో నటించే హీరోయిన్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. టాలెంటెడ్ యాక్ట్రస్ నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. తీరా అనే పాత్రలో నివేదా నటిస్తుంది.
Introducing the talented and ravishing @Nivetha_Tweets as Theera from #Paagal 😍#PAAGAL in THEATRES on MAY 1st 💥#PaagalOnMay1st @VishwakSenActor@SVC_official @NaresshLee @maniDop @radhanmusic @Garrybh88 @BekkemVenugopal @luckymediaoff #VS5 @AdityaMusic pic.twitter.com/dCfw1uPx44
— Sri Venkateswara Creations (@SVC_official) March 18, 2021
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రధాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మణికందన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మే 1వ తేదీన ఈసినిమా ధియేటర్ల లోకి రానుంది. మరి ఫలక్ నామా దాస్, హిట్ సినిమాలు సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ ఈసినిమాతో మరో హిట్ ను తన ఖాాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఈసినిమా ఎంత వరకూ విజయాన్ని అందిస్తుందో చూద్దాం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























