పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పండుగ ట్రీట్ వచ్చేసింది. శివరాత్రికి పవన్ -క్రిష్ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పిన దగ్గర నుండి ఫ్యాన్స్ దానికోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ నేడు పవన్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోపాటు టైటిల్ నుకూడా రిలీజ్ చేశారు. ఎప్పటినుండో వార్తలు వస్తున్నట్టే ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్ నే ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ‘హరిహర వీరమల్లు’గా పవన్ కళ్యాణ్ నటించనున్నాడు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈసినిమాను తెలుగుతో పాటు పలు బాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్లను బట్టి అర్ధమవుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక భారీ బడ్జెట్ తో పీరియాడిక్ చిత్రంగా నిర్మిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం ఏకంగా చార్మినార్, ఎర్రకోట, మచిలీపట్నం పోర్ట్ వంటి భారీ సెట్లను నిర్మించారు. పీరియడ్ డ్రామా ఫిల్మ్ కావడంతో, వీఎఫ్ఎక్స్ ల కోసమే ఎక్కువ టైమ్ పడుతుంది కాబట్టి జూలై నాటికి మొత్తం చిత్రీకరణను పూర్తిచేయాలని చూస్తున్నారట చిత్రయూనిట్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: