శ్రీనివాస్ నాయుడు నడికట్ల డైరెక్షన్లో ఆది హీరోగా ‘శశి’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమానుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఒకేఒక లోకం నువ్వు అనే సాంగ్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాను మొదట ఫిబ్రవరి లోరిలీజ్ చేద్దామనుకున్నా తరువాత మార్చికి పోస్ట్ పోన్ చేశారు. మార్చి 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. త్వరలో ట్రైలర్ నురిలీజ్ చేస్తామని తెలిపారు చిత్రయూనిట్.
And it’s 𝐔/𝐀 for our soulful love story #Sashi ❤️ 👫 Can’t wait to bring this to you!
Releasing Worldwide on March 19th! #SashiOnMarch19th#AadiSaiKumar @Surbhiactress @rashis276 @SNaiduNadikatla @Arunchiluveru @SHMovieMakers @rpvarmadatla @adityamusic pic.twitter.com/XeJMaMpnxk— Sri Hanuman Movie Makers (@SHMovieMakers) March 8, 2021
కాగా ఈ సినిమాలో సురభి, రాశీ సింగ్ హీరోయిన్లు గా నటిస్తుండగా రాజీవ్ కనకాల, జయప్రకాష్, అజయ్, వెన్నెల కిషోర్, రాశి సింగ్, తులసి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు. మరి జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు ఆది సాయికుమార్. ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.