అల్లరి గతం.. భవిష్యత్తుకి ఇది నాంది

Natural Star Nani Congratulates Allari Naresh On Naandhi Movie Success On Twitter In A Fun Way,Naandhi,Naandhi Film,Naandhi Movie,Naandhi Telugu Movie,Naandhi Movie Telugu,Natural Star Nani,Nani,Allari Naresh,Allari Naresh Naandhi,Allari Naresh Naandhi Success,Natural Star Nani Congratulates Allari Naresh On Naandhi Movie Success,Nani Congratulates Allari Naresh,Nani Congratulates Allari Naresh On Naandhi Success,Nani On Naandhi Movie Success,Natural Star Nani About Naandhi Movie Success,,Nani Tweet On Allari Naresh,Natural Star Nani Praises Hero Allari Naresh,Nani Suggestion For Allari Naresh,Nani Suggest To Allari Naresh,Natural Star Nani Tweet On Allari Naresh,Nani Congratulates Hero Allari Naresh,Natural Star Nani Latest News,Nani Latest Film Updates,Allari Naresh New Movie

విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన నాంది సినిమా ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలే ఉండగా ఆ అంచనాలను రీచ్ అయింది. ముఖ్యంగా నాని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఎప్పుడూ కామెడీ పాత్రలతో కనిపించే అల్లరి నరేష్‌.. ఇలా సీరియస్‌గా నటనకు ప్రాధాన్యమున్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించే రేంజ్ లో నటించాడు. ఇక ప్రేక్షకులతో పాటు పలువురు సెబ్రిటీలు కూడా నరేష్ నటనపై ప్రశంసలు కురిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు నాని కూడా నాంది సినిమా చూసి నరేష్ నటనపై ప్రశంసలు కురిపించాడు. మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను.. రేయ్ రేయ్ రేయ్.. ఇప్పుడు అల్లరి నరేష్ కాదు.. పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం. భవిష్యత్తుకి ఇది నాంది.. చాలా సంతోషంగా ఉంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. ఇక నుంచి ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరుకుంటున్నాను..’ అంటూ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు.

అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న హీరో నరేష్. తన కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో.. వరుస హిట్లతో దూసుకుపోయిన అల్లరి నరేష్ గత కొంతకాలంగా కాస్త వెనుకపడ్డాడు. మధ్యలో గమ్యం, శంభో శివ శంభో సినిమా ల్లో పాత్ర ప్రాధమైన రోల్స్ చేశాడు. ఇక ఇటీవల మహర్షి సినిమాలో.. మహేష్ బాబు కు ఫ్రెండ్ గా కీలక పాత్రలో నటించి మంచి మార్కులే కొట్టేసాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − four =