అందుకే నేను డ్రైవింగ్‌కు దూరం

Shruti Haasan Makes An Interesting Revelation About Car Driving,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shruti Haasan,Actress Shruti Haasan,Heroine Shruti Haasan,Shruti Haasan About Car Driving,Car Driving,Shruti Haasan On Car Driving,Shruti Haasan Car Driving,Shruti Haasan Latest News,Shruti Haasan New Updates,Shruti Haasan New Movie Deatils On Cards,Shruti Haasan Upcoming Movie Details On Cards,Shruti Haasan Next Project Details On Cards,Shruti Haasan Latest Movie Details On Cards,Shruti Haasan Revelation About Car Driving,Shruti Haasan Driving,Shruti Haasan New Move Updates

ఏ విషయాన్ని అయినా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో శృతి హాసన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అంతేకాదు తనలోని లోపాలను కూడా ఎలాంటి అభ్యంతరం లేకుండా బయటకు చెప్పేస్తుంటుంది ఈ భామ. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా మరోసారి తనకున్న మరో లోపం ఏంటో చెప్పుకొచ్చింది. అదేంటంటే తనకు డ్రైవింగ్
అంటే అస్సలు ఇష్టముండదట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నాకు చాలా వ‌రస్ట్‌గా డ్రైవింగ్ చేసే అలవాటు ఉంది. నాఅంత బ్యాడ్ గా ఎవ‌రూ డ్రైవింగ్ చేయ‌లేరేమో. అందుకే నేను డ్రైవింగ్‌కు దూరంగా ఉంటాను… ఫ్యూచర్ లో ఎలక్ట్రిక్ కొనాల‌నుకుంటున్నా. ఎలక్ట్రిక్ కార్లు వాతావ‌ర‌ణం కాలుష్యం కాకుండా కాపాడుతాయి అందుకే అవి కొనాల‌ని ఇష్టం అని చెప్పుకొచ్చింది.

క్రాక్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది శృతి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీ గా ఉంది భామ. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై బ్లాక్‌ బస్టర్‌ మూవీ ‘కేజీఎఫ్‌’ నిర్మించిన విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక దీనితో పాటు వకీల్ సాబ్ సినిమాలో నటిస్తుంది. ఇంకా ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహిస్తున్న లాభం అనే సినిమాలో కూడా శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + five =