వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ ను తెలుగులో ‘వకీల్ సాబ్’ గా చేస్తున్నసంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ కాబట్టి అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఫాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సినిమా మాత్రం ఇంకా లేట్ అవుతుంది.ఫైనల్లీ ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే వకీల్ సాబ్ చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా నుండి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలుసు. ఇక ఆ తర్వాత ఒక్క అప్డేట్ కూడా రాలేదు. మధ్యలో థమన్ ఆల్బమ్ గురించి అప్ డేట్స్ చూసి ప్రేమికుల రోజున అయినా ఏదైనా పాట వస్తుందేమో అనుకున్నారు కానీ అది రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా పాటల గురించి ఒక అప్ డేట్ ఇచ్చాడు. వకీల్ సాబ్ సాంగ్స్ షెడ్యూల్ ఫిక్స్ అయిందని.. మార్చిలో మ్యూజికల్ ట్రీట్ ఉంటుందని తెలిపాడు.
Musical March 🎉🥳 https://t.co/RLfYn7O8TA
— Sri Venkateswara Creations (@SVC_official) February 16, 2021
ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి,శ్రుతిహాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. బోనీ కపూర్ నిర్మాణ సంస్థ బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: