శివ కార్తికేయన్‌తో తో నా డీల్ అదే

Rakul Preet Singh Shares Her Experience Of Working With SivaKarthikeyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Actress Rakul Preet Singh,Heroine Rakul Preet Singh,Rakul Preet,Rakul Shares Her Experience,SivaKarthikeyan,Rakul Preet Singh About SivaKarthikeyan,Rakul Preet Singh On SivaKarthikeyan,Rakul Shares Her Experience Of Working With Sivakarthikeyan,Actor Sivakarthikeyan,Rakul Preet Singh SivaKarthikeyan Movie,Rakul Preet Singh Latest Movie Updates,Rakul Preet New Movie News

రకుల్ ప్రస్తుతం వరుస సినిమాతో షూటింగ్ లతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇక తమిళ్ లో శివ కార్తికేయన్ హీరోగా ‘అయలాన్’ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివకార్తికేయన్ పై రకుల్ ప్రశంసలు కురిపించింది. అంతేకాదు వాళ్ళిద్దరి మధ్య ఒక డీల్ కూడా కుదుర్చుకున్నట్టు తెలిపింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శివ కార్తికేయన్‌తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేశా. ఆయన చాలా మంచి నటుడు. డైలాగ్స్ ను తమిళంలో ఎలా పలకాలో తనకు నేర్పించాడని.. షూటింగ్ సమయంలో ఆయనతో ఒక డీల్ కుదుర్చుకున్నానని… సెట్స్ లో ఉన్నంత కాలం తనతో ఆయన ఇంగ్లిష్ లో మాట్లాడాలి… ఆయనతో తాను తమిళంలో మాట్లాడాలనేదే ఆ డీల్ అని చెప్పింది.

రకుల్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా వెంటనే మొదలైపోయింది. ఇంకా హిందీలో జాన్ అబ్రహాం “అటాక్ “, అర్జున్ కపూర్ ” ఛలే ఛలో ” మూవీస్ లో నటిస్తుంది. ఇంకా శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =