తమిళ స్టార్ విజయ్ సేతపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మంచి మంచి కథలతో టాప్ రేంజ్ కు ఎదిగాడు. విజయ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న నమ్మకం అందరిలో ఉంది. ఇక కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా వరుస ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్నాడు. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా విజయ్ సేతుపతి నటించిన మాస్టర్ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ సేతుపతి ..హీరోతో సమానమైన విలన్ పాత్రను పోషించారు. ఆయన పాత్రకు మంచి ప్రశంసలు దక్కాయి.
ఇక ఈరోజు విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించి పలు అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఉప్పెన సినిమా నుండి కొత్త పోస్టర్ ను రిలీజ్ చేయగా తాజాగా ఆయన కొత్త సినిమాకు సంబంధించి అధికారికంగా ప్రకటించారు. గాంధీ టాక్స్ అనే కొత్త సినిమా చేస్తున్నాడు విజయ్. దానికి సంబందించిన పోస్టర్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ఒక కొత్త ఛాలెంజ్ చేస్తున్నాను మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
“At times Silence is so loud”. On the occasion of my birthday. I am announcing my new film’s poster. I am set for a new challenge and new beginning with a silent film #GANDHITALKS Need your love and blessings. 🙏🙏 @kishorbelekar @divay_dhamija @moviemillent pic.twitter.com/5NtrAD5t4d
— VijaySethupathi (@VijaySethuOffl) January 16, 2021
కాగా తెలుగులో ప్రస్తుతం విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇంకా వీటితోపాటు ‘మామనిదన్’, ‘కడైశీ వివసాయి’, ‘లాభం’, ‘తుగ్లక్ దర్బార్’ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు విజయ్.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.