ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యం – సాయి ధరమ్ తేజ్

2020 Telugu Movies News, latest telugu movies news, Latest Tollywood News, No Pelli Song, Sai Dharam Tej, Sai Dharam Tej Latest News, Sai Dharam Tej Next Project News, Sai Dharam Tej On No Pelli Song, Sai Dharam Tej Upcoming Movie Details, Solo Brathuke So Better, Solo Brathuke So Better Movie, Telugu Filmnagar, Telugu Movies Updates, Tollywood Movie Updates

సక్సెస్ ఫుల్ “పిల్లా నువ్వు లేని జీవితం “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి తేజ్ “సుబ్రమణ్యం ఫర్ సేల్ “, “సుప్రీమ్ “,”చిత్రలహరి “, “ప్రతి రోజూ పండగే ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై సుబ్బు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ డిసెంబర్ 25 వ తేదీ భారీ ఎత్తున మల్టీ ప్లెక్స్ , థియేటర్స్ లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సాయి తేజ్ మీడియా తో సమావేశమయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో సాయి తేజ్ మాట్లాడుతూ .. మన స్వేఛ్చ , సంతోషం మన చేతుల్లోనే ఉండాలనే కాన్సెప్ట్ తో “సోలో బ్రతుకే సో బెటర్ “మూవీ తెరకెక్కిందనీ , తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి జీవితాన్ని సాగించాలని క్యారెక్టర్ లో నటించాననీ , మూవీ కంటెంట్ పై యూనిట్ మెంబర్స్ అందరికీ సంపూర్ణ విశ్వాసం ఉందనీ , ఫ్యామిలీస్ , స్నేహితులు కలసి చూసేలా ఈ మూవీ రూపొందిందనీ , పెళ్ళి గురించి మాట్లాడుతూ .. పెళ్ళి ని కొంతకాలం వాయిదా వేయడం మినహా అబ్బాయిల చేతుల్లో ఉండదనీ , లాక్ డౌన్ రావడం తో పెళ్ళి ని ఏడాదిన్నర వాయిదా వేయగలిగాననీ, తరువాత పెళ్ళి గురించి ఆలోచిస్తాననీ, ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో ఒక మూవీ , దర్శకుడు సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో ఒక మూవీ లో నటిస్తున్నాననీ, ప్రస్తుత పరిస్థితులలో కలెక్షన్స్ లెక్కల కంటే థియేటర్స్ కు వచ్చే ప్రేక్షకుల ఆరోగ్యమే ముఖ్యం అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =