‘అన్నాత్తే’ సిబ్బందికి కరోనా – ఆగిపోయిన షూటింగ్

Annaatthe Shoot Halted As The Crew Testing Corona Positive,Rajinikanth’s Annaatthe Shoot Halted As Crew Members Test Positive For Coronavirus,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Movies Updates,Tollywood Movie Updates,Latest Tollywood News,2020 Telugu Movies News,Annaatthe,Annaatthe Movie,Annaatthe Telugu Movie,Annaatthe Movie Shooting Updates,Annaatthe Movie Shooting Latest News,Superstar Rajinikanth Latest News

శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్నాత్తే సినిమా షూటింగ్ జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ షూటింగ్ కు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది. దానికి కారణం క్యాస్టింగ్ లో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడమేనట. షూటింగ్ సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ‘అన్నాత్తే’ షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే రజినీకాంత్ కు మాత్రం కరోనా నెగిటివ్ రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.

కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి కూడా విదితమే. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేశారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమనే అర్ధమవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 9 =