సందీప్ కిషన్ ‘రౌడీ బేబీ’ షూటింగ్ మొదలు

Kona Film Corporation, Kona Film Corporation Movies, Kona Film Corporation Next Film, Kona Film Corporation Next Film Starring Sundeep Kishan, Kona Film Corporation Next Film Starring Sundeep Kishan Titled Rowdy Baby, Kona Film Corporation Next Film Titled Rowdy Baby, Kona Film Corporation Next Movie, Kona Venkat, Kona Venkat Upcoming movies, Sundeep Kishan, Sundeep Kishan Next Movie, Sundeep Kishan Rowdy Baby, Sundeep Kishan Rowdy Baby Movie, Telugu Filmnagar

సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వెంకటాద్రి టాకీస్‌ నిర్మాణ సంస్థను స్థాపించి ప్రొడక్షన్‌ నెం1 గా ‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో నిర్మాతగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మొదటి సినిమాతో మంచి విజయాన్నే దక్కించుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

ఇక వీటితో పాటు సందీప్‌ కిషన్‌ హీరోగా ఎంవీవీ బ్యానర్‌లో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమా కోన వెంకట్‌, ఎంవీవీ సత్యనారాయణ ప్రొడక్షన్‌లో వస్తుంది. ఈ సినిమాకు కోన వెంకట్‌ కథను అందిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు “రౌడీ బేబీ” అనే టైటిల్‌ను ఖరారు చేసారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.