టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్ ను ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా తాజాగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు. ఈ మూవీ షూటింగ్ ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంఛ్ అయింది. నాని తండ్రి ఘంటా రాంబాబు..నాని, కృతిశెట్టి, సాయిపల్లవిపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా… మేర్లపాక గాంధీ కెమెరా స్విచ్చాన్ చేయగా..అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించాడు. శివనిర్వాణ, వెంకీ కుడుముల స్క్రిప్ట్ ను నిర్మాతకు అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.మడోన్నా సెబాస్టియన్, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అందిస్తున్నాడు.
దీనితో పాటు శివనిర్వాణ దర్శకత్వంలో నాని ‘టక్ జగదీష్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను… సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తుండగా.. . థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: