బ్లాక్ బస్టర్ “ధడక్” మూవీ తో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తల్లి శ్రీదేవి పోలికలతో ఉన్న జాన్వీ కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. “గుంజన్ సక్సేనా -ది కార్గిల్ గర్ల్ “మూవీ లో జాన్వీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం “రూహి అఫ్జానా “,”దోస్తానా 2 “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్”హెలెన్ ” మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శ్రీదేవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అతిలోక సుందరి శ్రీ దేవి తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీ దేవి నటవారసురాలి గా జాన్వీ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఇప్పుడు జాన్వీ తన ఇంటిలో ఒక సాంగ్ కు సాంప్రదాయ భంగిమలతో డ్యాన్స్ చేసి , ఆవీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. జాన్వీ డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























